పారిశుధ్య పనులు చేపట్టండి
ABN , First Publish Date - 2020-05-09T09:35:54+05:30 IST
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత చురుగ్గా చేపట్టాలని ఎంపీడీవో త్రినాథరావు తెలిపారు.
మెరకముడిదాం, మే 8 : గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత చురుగ్గా చేపట్టాలని ఎంపీడీవో త్రినాథరావు తెలిపారు. గర్భాం, బైరిపురం గ్రామాల్లో శుక్రవారం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ పల్లెల్లో గ్రీన్ అం బాసీడర్లతో ద్రావణం పిచికారీ చేయించాలని, రోడ్లపై చెత్తా చెదారం, కాలువల్లో పూడికలు తీయించాలని తెలిపారు. గ్రామస్థులు పరి శుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ఈవోఆర్డీ విమల కుమారి, గర్భాం ఈవో వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.