నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-11-28T04:50:13+05:30 IST

చిన్నారులు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి డిమాండ్‌ చేశారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి
ఘోషాసుపత్రిలో టీడీపీ నాయకులు

విజయనగరం రూరల్‌, నవంబరు 27: చిన్నారులు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి డిమాండ్‌ చేశారు. భోగాపురం మండలంలో  అత్యాచారానికి గురై ఘోషాస్పత్రిలో చికిత్సపొందుతున్న చిన్నారి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. వనజాక్షి మాట్లాడుతూ ఇటీవల మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వారు రెచ్చిపోతున్నారన్నారు. దాడులు చేస్తున్న వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని విజయనగరం అసెంబ్లీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు, తెలుగు మహిళ కార్యదర్శి అనురాధ బేగం డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫోన్‌లో ఆరాతీశారు. పరా మర్శించిన వారిలో మహంతి చిన్నంనాయుడు,  కర్రోతు బంగార్రాజు, సువ్వాడ రవిశేఖర్‌, కంది చంద్రశేఖర్‌ ఉన్నారు.   గుర్ల: బాలికల రక్షణ చట్టాలు పక్కాగా అమలు చేయాలని  జిల్లా మానవహక్కుల సంఘం మహిళా అధ్యక్షురాలు పద్మలత కోరారు. శుక్రవారం గుర్లలో మాట్లాడుతూ...  బాలికలపై అగౌరవంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  భోగాపురంలో జరిగిన సంఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.  ఇలాంటివి పునారావృతం కాకుండా చూడాలన్నారు. 

 

 

Read more