సిరివర గిరిజనులకు తీపికబురు

ABN , First Publish Date - 2020-11-27T05:22:31+05:30 IST

రోడ్డు కోసం పరితపిస్తున్న సాలూరు మండలం సిరివర గిరిశిఖర గిరిజనులకు ఓఎస్డీ సూర్యచంద్రరావు తీపి కబురు చెప్పారు.

సిరివర గిరిజనులకు తీపికబురు

 రూ.12 కోట్లతో రోడ్డుకు ప్రతిపాదనలు  

 ఓఎస్డీ సూర్యచంద్రరావు 

సాలూరు రూరల్‌, నవంబరు 26: రోడ్డు కోసం పరితపిస్తున్న సాలూరు మండలం సిరివర గిరిశిఖర గిరిజనులకు  ఓఎస్డీ సూర్యచంద్రరావు తీపి కబురు చెప్పారు. ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సిరివర తదితర గ్రామాల్లో గురువారం కాలినడక కొండలెక్కి పర్యటించా రు. సిరివర గిరిజనులతో ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సిరివర లో గిరిజన యువనేత సీదరపు కృష్ణ రోడ్డు లేక పడుతున్న కష్టాలను వివరించారు. తాము విరాళాలు పోగు చేసుకొని రోడ్డు వేసుకుంటే అధికారులొచ్చి అడ్డుకున్నారని చెప్పారు. అందుకు ఆయన స్పందించి గ్రామానికి రోడ్డు వేయ డానికే పరిశీలనకే తాను వచ్చినట్టు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం నుంచి రూ.12 కోట్లతో సిరివర నుంచి నంద వరకు రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదన చేశామని వెల్లడించారు. ఆ నిధులతో త్వరలో రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పాడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్‌ అధికారి సూర్యచంద్రరావు కొండలెక్కి కాలినడకన తమ గ్రామానికొచ్చి రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పడంపై సీదరపు కృష్ణ తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మక్కువ ఎస్‌ఐ రాకేశ్‌, సాయుధ సిబ్బంది ఉన్నారు. 

 


Updated Date - 2020-11-27T05:22:31+05:30 IST