-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Super services coming soon MLA
-
త్వరలోనే ‘సూపర్’ సేవలు : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-30T06:00:37+05:30 IST
పార్వతీపురంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభించి, త్వరలోనే సేవలు అందుబాటు లోకి తెస్తామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మంగళ వారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో సహకరిస్తున్నారని అన్నారు.

పార్వతీపురం : పార్వతీపురంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభించి, త్వరలోనే సేవలు అందుబాటు లోకి తెస్తామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మంగళ వారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. సీతానగరం మండలం లో గెడ్డలుప్పి వంతెన నిర్మాణం, బలిజిపేట మండలంలో నారాయణ పురం వంతెన నిర్మాణ పనులతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్ర మాలు పూర్తవుతున్నాయన్నారు. వేలాది మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందిస్తున్నట్టు గుర్తుచేశారు. ప్రతి పక్షం మాత్రం ఏదో ఒక రకంగా బురద జల్లుతూనే ఉందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.