-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Sugarcane collection from 30
-
30 నుంచి చెరకు సేకరణ
ABN , First Publish Date - 2020-12-28T04:45:59+05:30 IST
భీమసింగి ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకున్న రైతుల నుంచి చెరకును సేకరించనున్నట్లు ఎండీ విక్టర్ రాజు తెలపారు.

శృంగవరపుకోట రూరల్ (జామి) : భీమసింగి ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకున్న రైతుల నుంచి చెరకును సేకరించనున్నట్లు ఎండీ విక్టర్ రాజు తెలపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30 నుంచి రైతులు తమ కాటా పరిధిలో ఉన్న ఫీల్డ్‌సిబ్బంది వద్ద కటింగ్ పర్మిట్లు స్వీకరించాలన్నారు. వాటి ప్ర కారం వారికి నిర్దేశించిన షిఫ్టుల్లో చెరకు సరఫరా చేసి ఫ్యాక్టరీకి సహక రించాలని కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, షుగర్ కేన్ కమిషనర్ ఆదేశాలమేరకు రైతులనుంచి సేకరిం చే చెరకును ఎన్‌సీఎస్ షుగర్స్ లచ్చ య్యపేటకు తరలిస్తామని తెలిపారు. చెరుకు రైతుల చెల్లింపులకు తామే పూర్తి బాధ్యతలు వహిస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెరకు సేకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పా ట్లు పూర్తిచేశామని చెప్పారు.