విద్యార్థి నిజాయితీ

ABN , First Publish Date - 2020-12-29T05:21:16+05:30 IST

సతివాడ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న మత్స ప్రశాంత్‌ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తనకు దొరికిన పర్సును అందులో ఉన్న ఫోన్‌ నెంబరు ఆధారంగా సదరు బాధితుడికి అందజే శాడు.

విద్యార్థి నిజాయితీ

నెల్లిమర్ల, డిసెంబరు 28: సతివాడ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న మత్స ప్రశాంత్‌ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తనకు దొరికిన పర్సును అందులో ఉన్న ఫోన్‌ నెంబరు ఆధారంగా సదరు బాధితుడికి అందజే శాడు. ఆ పర్సులో రూ.13,500, చెక్కు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, సిమ్‌ కార్డులు ఉన్నాయి. సదరు బాధితుడు విజయనగరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సీహెచ్‌.నాగసింహాచలం. ఆయన సోమవారం సతివాడలోని ఆదర్శ పాఠశాలకు వచ్చి నిజాయితీగా వ్యవహరించిన విద్యార్థి ప్రశాంత్‌ను ప్రిన్సిపాల్‌ ఆర్‌.రామకృష్ణారావు సమక్షంలో సత్కరించారు. అలాగే రూ.2వేలు ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. 

 


Updated Date - 2020-12-29T05:21:16+05:30 IST