నేర రహిత సమాజం కోసం కృషి చేయాలి
ABN , First Publish Date - 2020-03-08T11:00:39+05:30 IST
నేరం లేని సమాజం కోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు కృషిచేయాలని ఎస్పీ రాజకుమారి

విజయనగరం క్రైం, మార్చి 7: నేరం లేని సమాజం కోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు కృషిచేయాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. శనివారం విజయనగరం పోలీసు శిక్షణ కేంద్రంలో జరిగిన ఆరో బ్యాచ్ గ్రామ, వార్డు సచివాలయ సంరక్షణ కార్యదర్శుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి మాట్లాడారు. దిశ చట్టం ద్వారా మహిళలపై లైంగికదాడులకు పాల్పడే వారికి విధించే శిక్షలపై అవగాహన కల్పించాలన్నారు.
గ్రామ, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆపదల్లో ఉన్న మహిళలను ఆదుకుంటామన్నా భరోసా కల్పించామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని, గ్రామ, వార్డుల్లో సమాచారాన్ని ముందుస్తుగా సేకరించి, సంబంధిత అధికారులకు అందించాలన్నారు. అనంతరం శిక్షణ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ రామ్మోహన్ రావు, విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, డీటీసీ సీఐ రాజశేఖర్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.