-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Strict measures not to follow lockdown
-
లాక్‌డౌన్ పాటించకుంటే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-03-25T11:30:18+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గాను ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిందని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ

రాజా కళాశాల మైదానానికి కూరగాయల మార్కెట్
నేటి నుంచి దుకాణాలకు నియమిత వేళలు
సీఐ కేశవరావు
బొబ్బిలి, మార్చి 24:కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గాను ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిందని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ ఇ.కేశవరావు అన్నారు. మంగళవారం బొబ్బిలి మునిసిపల్ కార్యాలయంలో స్వచ్ఛం ద సంస్థలు, కిరాణా వర్తక సంఘం ప్రతినిధు లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొబ్బిలి పట్ట ణంలోని కూరగాయల దుకాణాలను బుధవారం నుంచి రాజాకళాశాల మైదానానికి తరలిస్తున్నామన్నారు. ఉదయం ఏడు నుంచి పది గంటల వరకూ మాత్రమే షాపులు ఉంటాయని చెప్పారు. కిరాణా షాపులు కూడా ఇదే సమయాన్ని పాటించాలన్నారు. మిల్క్‌ప్రోడెక్ట్స్‌కు సంబం ధించి ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు, మళ్లీ సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు తెరవవచ్చని చెప్పారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలు రోడ్లపైకి రాకూడదని, ఇళ్లలోనే ఉండాలన్నారు. మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. నిబంధనలను అతిక్ర మించిన వారికి చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ నాయుడు తెలిపారు. సమావేశంలో కిరాణావర్తకసంఘం అధ్యక్షుడు కింతలి శ్రీనివాసరావు, కారుణ్య ఫౌండేషన్, అభిమాని, సాహితీ ఫౌండేషన్, రోటరీ, గ్రీన్‌బెల్టు, యంగ్‌మెన్స్ హేపీక్లబ్ ప్రతినిధులు జేసీ రాజు, రెడ్డి రాజగోపాల నాయుడు, మరిశర్ల రామా రావునాయుడు, కాసులదేవి చంద్రకిశోర్, గెంబలి శ్రీనివాసరావు, ఎస్‌వీ రమణ మూర్తి మింది విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.