-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Strict measures if timeliness is not adhered to
-
సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-12-30T06:00:48+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో తిరుమలప్రసాద్ తెలిపారు. బూసాయవలస ప్రభుత్వ పాఠశాలను మంగళ వారం సందర్శించారు.

రామభద్రపురం: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో తిరుమలప్రసాద్ తెలిపారు. బూసాయవలస ప్రభుత్వ పాఠశాలను మంగళ వారం సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ కొవిడ్ నిబంధనలకు అను గుణంగా పాఠశాల నడిపించాలని సూచించారు. నాడు-నేడు పనుల ప్రగతి ఎంతవ రకు వచ్చిందని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. హెచ్‌ఎం తదిత రులు పాల్గొన్నారు. అమ్మఒడి పథకానికి ఈ నెల 30లోగా కొత్తగా విద్యా ర్థులు పాఠశాలలు, సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కంట్యాక్స్ చెల్లించేవారు, రూ.10వేలు దాటిన ఉద్యోగులు, ఎక్కువ భూములున్నవారికి అమ్మఒడి వర్తించదని ఆయన తెలిపారు.