లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : జేసీ

ABN , First Publish Date - 2020-11-08T04:44:36+05:30 IST

జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ మహేష్‌కుమార్‌ హెచ్చరించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : జేసీ

 

విజయనగరం రింగురోడ్డు:

జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ మహేష్‌కుమార్‌  హెచ్చరించారు. శనివారం తన కార్యాలయంలో పోలీసు, వైద్యశాఖ అధికారులతో మాట్లాడుతూ.. లింగనిర్ధారణకు యంత్రాలను వినియోగిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి స్కాన్‌ సెంటర్‌ను ప్రొగ్రాం అధికారులతో తనిఖీలు చేయించాలని ఆదేశించారు.  అనంతరం మాతృమర ణాలపై సమీక్షించారు. జిల్లాలో నర్సింగ్‌హోంలు, ఆసుపత్రుల్లో జరుగుతున్న మరణాలపై  ఆయా పీహెచ్‌సీల వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసు కున్నారు. సమావేశంలో జడ్జి ఎం.మాధురి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి, దిశా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ త్రినాథ్‌, జిల్లా ఆసు పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ నాగభూషణరావు, నేచర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జీకే దుర్గ, రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-08T04:44:36+05:30 IST