గడువులోగా లే అవుట్‌ క్రమబద్ధీకరణకు చర్యలు

ABN , First Publish Date - 2020-12-25T05:47:09+05:30 IST

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లే అవుట్‌ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ వెంకటేశ్వరావు ఆదేశించారు.

గడువులోగా లే అవుట్‌ క్రమబద్ధీకరణకు చర్యలు

రింగురోడ్డు : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లే అవుట్‌ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ వెంకటేశ్వరావు ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ సమేవేశ మందిరంలో వార్డు ప్రణాళికా కార్యదర్శులకు దిశా నిర్దేశం చేశారు. లే అవుట్‌ క్రమబద్ధీకరణ వివరాలు గతంలో వీఎంఆర్డీఏకు పంపేవారని, ప్రస్తుతం  సడలించిన  నిబంధనల ప్రకారం వాటిని నివృత్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. నిర్మాణ దశలోనే ఉన్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.  భవన నిర్మాణ  అనుమతులు  సరళతరం చేసినట్లు తెలిపారు. టీపీవోలు కనకారావు, శ్రీలక్ష్మి, టౌన్‌ సర్వేయర్‌ సింహాచలం పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-25T05:47:09+05:30 IST