కేంద్ర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పేరు

ABN , First Publish Date - 2020-11-27T05:21:11+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకానికి రాష్ట్రంలో పేరు మార్చి జగనన్న తోడు అంటూ వైసీపీ ప్రభుత్వం హడావిడి చేస్తూ చిరు వ్యాపారు లను సైతం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బొబ్బి లి చిరం జీవులు ఆరోపించారు.

కేంద్ర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పేరు

పార్వతీపురం, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకానికి రాష్ట్రంలో పేరు మార్చి జగనన్న తోడు అంటూ వైసీపీ ప్రభుత్వం హడావిడి చేస్తూ చిరు వ్యాపారు లను సైతం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బొబ్బి లి చిరం జీవులు ఆరోపించారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వ కుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో పథకాలు అమలు చేస్తూ గొప్పలు చెప్పు కుం టుందని ఆరోపించారు. గ్రామాల్లో వైసీపీ నాయకులు, వలంటీర్లు జగనన్న తోడు అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు.  కార్య క్రమంలో టీడీపీ నాయకులు బోను దేవీచంద్రమౌళి, దొగ్గ మోహన్‌, జాగాన రవిశంకర్‌, గౌరునాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:21:11+05:30 IST