కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-12T05:10:12+05:30 IST
గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. పక్కిలో శుక్రవారం ఆయన ధాన్యం కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు.
బొబ్బిలి రూరల్: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. పక్కిలో శుక్రవారం ఆయన ధాన్యం కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్‌గ్రేడ్ ధాన్యం క్వింటా ధర రూ.1886, సాధారణ రకా నికి రూ.1860 మేర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుంద న్నారు. ముందుగా బయోమెట్రిక్‌లో రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వ హించారు. ఉపాధి కార్డుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు శంబంగి వేణుగోపాలనాయుడు, తహసీల్దార్ లక్ష్మీప్రసాద్‌పాత్రో, ఏపీఎం అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. మెరకముడిదాం : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డీసీఎంఎస్ చైర్మన్ ఎస్‌వీ రమణరాజు తెలిపారు. సోమలింగాపురం పీఏసీఎస్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వ రరావు, వేణుగోపాలరావు, మోతీలాల్‌నాయుడు, నరేష్ కుమార్, కృష్ణమూర్తిరాజు, ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.