సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-07-27T11:15:24+05:30 IST

తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువల పర్యవేక్షణపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఎస్‌ఈ కె.పోలేశ్వర రావు సూచించారు

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

గరుగుబిల్లి, జూలై 26 : తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువల పర్యవేక్షణపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఎస్‌ఈ కె.పోలేశ్వర రావు సూచించారు. ఆదివారం కుడి ప్రధాన కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న పెదగుడబ సమీపంలోని 6.1 కిలోమీటరు ప్రాంతంలో 8 మీటర్ల వెడల్పులో కుడి వైపున గండి పడిందన్నారు. చిన్నపా టిగా ఉన్న గండ్లు అక్రమంగా నీరును మళ్లించడంతో పెద్దవిగా మారి గండ్లు పడే అవకాశం నెలకొంద న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పలువురు పర్యవేక్ష ణకు అవసరమైన సిబ్బంది నియామకానికి ఉన్నతాధి కారులకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రధాన కాలువ నుంచి రెండు జిల్లాలకు సంబంధించి లక్ష ఎకరాలకు పైగా సాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు.


ప్రధానంగా 900 క్యూసెక్కులకు పైగా సాగు నీరు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ గండ్లు కారణంగా 700 క్యూసెక్కులు సరఫరా చేస్తు న్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేని కార ణంగా దిగువ ప్రాంతాలకు సాగునీటి కొరత నెలకొందని, దీనిని దృష్టిలో పెట్టుకుని 900 క్యూసె క్కులకు పైగా విడుదల చేయాలని ప్రాజెక్టు ఇంజినీ రింగ్‌ అధికారులను ఆదేశించారు. సాగునీరు సరఫరా సమయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయన వెంట ప్రాజెక్టు డీఈఈలు వేణుగోపాలనా యుడు, శ్రీహరి, జేఈలు కె.శ్రీనివాస రావు, నవీన్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-07-27T11:15:24+05:30 IST