వెలుగు కార్యాలయంలో శ్రీవిద్య దీక్ష

ABN , First Publish Date - 2020-12-11T05:31:24+05:30 IST

పెదతరిమి వెలుగు గ్రామైక్య సంఘం సహాయకురాలు పుట్టా శ్రీవిద్య గురువారం ఉదయం వెలుగు కార్యాలయంలోనే కూర్చుని నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

వెలుగు కార్యాలయంలో శ్రీవిద్య దీక్ష

నెల్లిమర్ల, డిసెంబరు 10: పెదతరిమి వెలుగు గ్రామైక్య సంఘం సహాయకురాలు పుట్టా శ్రీవిద్య గురువారం ఉదయం వెలుగు కార్యాలయంలోనే కూర్చుని నిరాహార దీక్షకు ఉపక్రమించారు. ఈ విషయాన్ని వెలుగు అధికారులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఏఎస్‌ఐ శోభారాణి అక్కడకు చేరుకుని ఆమెతో మాట్లాడారు. సమస్య పరిష్కరించేందుకు వెలుగు అధికారులతో చర్చలు ఏర్పాటు  చేస్తామని హామీ ఇచ్చారు. పెదతరిమి వెలుగు వీఓఏగా పనిచేస్తున్న శ్రీవిద్యను వెలుగు అధికారులు ఇటీవల తొలగించిన నేపధ్యంలో ఆమె గత నెల 9వ తేదీ నుంచి నిరసన తెలియజేస్తున్నారు. 


Updated Date - 2020-12-11T05:31:24+05:30 IST