భవన నిర్మాణాలు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-11-07T05:40:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు - నేడు, సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చే యాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాథ్‌ కోరారు.

భవన నిర్మాణాలు వేగవంతం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

పార్వతీపురం, నవంబరు 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు - నేడు, సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చే యాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాథ్‌ కోరారు. శుక్రవారం తన చాం బర్‌లో పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ప్లాన్‌ మండలాల్లో చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయా లని, నిర్మాణ పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధి కారులకు ఆదేశించారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ శాంతేశ్వరరావుతో పాటు పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈలు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-07T05:40:32+05:30 IST