కరోనా కట్టడికి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-03-27T11:24:35+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదని కోరుతూ గురువారం సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మకర్త
కురుపాం, మార్చి26: కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదని కోరుతూ గురువారం సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మకర్త కోరా శ్రీనివాసరావు, భక్తులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకలు రాజు, నెల్లి సింహచలం, సంతోష్ విశేష అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం విబూదిని గ్రామ పరిసరాల్లో చల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుడ్ల నగేష్ , గొటారి వెంకటరావు, జామి దేవిప్రసాద్, కొత్తకోట విశ్వనాథం పాల్గొన్నారు.