-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Special intelligence on those coming from abroad
-
విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా
ABN , First Publish Date - 2020-03-25T11:28:10+05:30 IST
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని అధికారులకు

విజయనగరం (ఆంధ్రజ్యోతి), మార్చి 24: ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని అధికారులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ అదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో పోలీసు, రెవెన్యూ, వైద్య, మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల జిల్లా కు చేరుకున్న విదేశీయులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూండా చూడాలన్నారు. రాష్ట్ర ఉన్నతాధి కారుల సమాచారం మేరకు జిల్లాకు 321 మంది వచ్చారని, వారు కదిలికలపై ప్రత్యేక నిఘా ఉండాలన్నారు.
విజయనగరం, పార్వతీపురం డివిజన్‌ల్లో 5 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విజయన గరం డివిజన్‌కు సంబంధించి జేఎన్‌టీయూవీ ఇంజినీరింగ్ కళాశాల, నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలల్లో, పార్వతీపురం డివిజన్‌లో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
నిత్యవసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ నిఘా పెట్టింది. ఎవరైన అధిక ధరలకు అమ్మితే క్రిమినల్ కేసులు నమెదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రతి ఏటా ప్రజల మధ్యలో నిర్వహిస్తున్న ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈనెల 31 వరకు ప్రజలు ఇంటి వద్ద నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.