ఎస్పీ రాజకుమారికి స్పెషల్‌ గ్రేడ్‌ హోదా

ABN , First Publish Date - 2020-02-12T10:41:26+05:30 IST

విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి సెల క్షన్‌గ్రేడ్‌ పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007 ఐపీఎస్‌ బ్యాచ్‌కు

ఎస్పీ రాజకుమారికి స్పెషల్‌ గ్రేడ్‌ హోదా

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 11: విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి సెల క్షన్‌గ్రేడ్‌ పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజకుమారి గతనెల 1 నుంచి ఈ పదోన్నతి హోదా కల్పించారు. విశాఖపట్నం రేంజ్‌ డీఐజీగా ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా ఎస్పీ రాజకుమారికి బ్యాడ్జి అందజేసి అభి నందనలు తెలిపారు. అలాగే ఏఎస్పీ శ్రీదేవి రావు, ఓఎస్‌డీ రామ్మోహనరావు, డీఎస్పీలు సీఎంనాయుడు, వీరాంజనేయరెడ్డి, ఎల్‌.శేషాద్రితో పాటు పోలీసు అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-02-12T10:41:26+05:30 IST