ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్‌

ABN , First Publish Date - 2020-11-22T04:50:31+05:30 IST

ప్రతి మునిసిపాలిటీలో ప్లాస్టిక్‌, పాలిథిన్‌ సంచుల నిర్మూలనకు వచ్చే నెల నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు.

ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌

కలెక్టరేట్‌, నవంబరు 21:

ప్రతి మునిసిపాలిటీలో ప్లాస్టిక్‌, పాలిథిన్‌ సంచుల నిర్మూలనకు  వచ్చే నెల నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. శనివారం శనివారం తన చాంబర్‌లో మునిసిపల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతికి తీరని హాని చేసే ప్లాస్టిక్‌, పాలిథిన్‌ సంచుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. వాటి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  ఆదేశించారు.  ప్లాస్టిక్‌ నియంత్రణలో బొబ్బిలి తప్ప మిగిలిన మునిసిపాలిటీలపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు.  దీనిపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలని,  ఆతర్వాత  ప్లాస్టిక్‌  క్రయ, విక్రయదారులపై  చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాల యాల్లో సిబ్బంది  సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న సచివాలయం సిబ్బందికి వాకీటాకీ హ్యాండ్‌ సెట్లు ఇవ్వాలని ఆదేశిం చారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

  దంత వైద్యుల సమస్యలు పరిష్కరించండి 

విజయనగరం రింగురోడ్డు: తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో కరోనా విధులు నిర్వహిస్తున్న దంతవైద్యులు శనివారం కలెక్టరేట్‌లో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టరు సురేష్‌బాబుకు వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో వారు దంత వైద్యులకు రావల్సిన జీతాలు,  సేవలను పొడిగించే విషయాన్ని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమ స్యలపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండి యన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోరంట్ల సతీష్‌బాబు, డాక్టర్లు బాలాజీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

  కలెక్టర్‌కు తానా ప్రశంసాపత్రం 

విజయనగరం దాసన్నపేట: కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌కు తానా ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ ఏడాది జనవరిలో వివిధ పాఠశాలల్లో ఏకకాలంలో తానా నిర్వహించిన  శతక పద్యార్చన కార్యక్రమానికి సంబంధించి అప్పట్లో కలెక్టర్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా నుంచి 1,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుభాషా పరిరక్షణ సమితి పర్యవేక్షించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో తానా తరఫున సమన్వయకర్తగా వ్యవహరించిన సమితి అధ్యక్షుడు గురుప్రసాద్‌  కలెక్టర్‌ ను కలిసి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్య క్షుడు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-11-22T04:50:31+05:30 IST