భూములు అప్పగించాలని ఆందోళన

ABN , First Publish Date - 2020-08-11T10:18:19+05:30 IST

తొంగురువలస పరిధిలో 64 మంది పారాది గ్రామ దళితులకు కేటాయించిన భూమిని వారికే అప్పగించాలని అంబేడ్కర్‌ పోరాట సమితి రాష్ట్ర ..

భూములు అప్పగించాలని ఆందోళన

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 10:  తొంగురువలస పరిధిలో 64 మంది పారాది గ్రామ దళితులకు కేటాయించిన భూమిని వారికే అప్పగించాలని అంబేడ్కర్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోరు సాంబయ్య డిమాండ్‌ చేశారు.   సోమ వారం పారాది హైవేపై అంబేడ్కర్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు భూస్వాములు పారాది దళితుల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 41 రోజులుగా బాధితులు దీక్ష చేస్తున్నప్పటికీ ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు.  తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని  డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో టీడీపీ నాయకులు అల్లాడ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T10:18:19+05:30 IST