-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Should houses be given to the deserving
-
అర్హులకుఇళ్లు ఇవ్వాల్సిందే...
ABN , First Publish Date - 2020-11-22T04:51:55+05:30 IST
విజయనగరం లోని సారిపల్లి, సోనియానగర్‌లో అర్హులకు త్వరితగతిన ఇళ్లు అందజేయాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఈ మేరకు శనివారం నగర కమిషనర్ వర్మకు వినతిపత్రం అందజేశారు.

విజయనగరం రూరల్, నవంబరు 21:
విజయనగరం లోని సారిపల్లి, సోనియానగర్‌లో అర్హులకు త్వరితగతిన ఇళ్లు అందజేయాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఈ మేరకు శనివారం నగర కమిషనర్ వర్మకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు ఇచ్చామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలు చూపించి, జాబితా నుంచి కొంత మందిని తీసేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిని అడ్డుకుంటామన్నారు. తక్షణమే పేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సైలాడ త్రినాథ్, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.