శంభో శంకర!

ABN , First Publish Date - 2020-12-08T05:09:21+05:30 IST

కార్తీక నాలుగో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

శంభో శంకర!
గుమ్మలకొండ గుహలో శివునికి పూజలు చేస్తున్న భక్తులు


 శివాలయాలకు పోటెత్తిన భక్తులు

 ఘనంగా కార్తీక  నాలుగో సోమవారం పూజలు


(ఆంధ్రజ్యోతి బృందం)

 కార్తీక నాలుగో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.   అంతటా శివ నామస్మరణ మార్మోగింది. వేకువజామునే  శైవక్షేత్రాల ఎదుట క్యూలైన్లలో బారులుదీరారు.   ప్రత్యేక అలంకరణలో ఉన్న శివయ్యను దర్శించి పులకించిపోయారు.   విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం ఆయా శివాల యాలు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. 

   

Updated Date - 2020-12-08T05:09:21+05:30 IST