రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-12-06T05:05:13+05:30 IST

కొండబారిడి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

కురుపాం రూరల్‌: కొండబారిడి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. బొడ్డుమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక తిక్కన అనే వ్యక్తి శనివారం గుమ్మలక్ష్మీపురం నుంచి తన స్వగ్రామానికి బైకుపై వెళ్తున్నాడు. కొండబారిడి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి, మొండెంఖల్‌ నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో  తిక్కన కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై నీలకంఠాపురం ఏఎస్‌ఐ పి.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-06T05:05:13+05:30 IST