‘ప్రభుత్వ భూములు విక్రయించడం సరికాదు’

ABN , First Publish Date - 2020-05-18T10:57:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను అమ్మి నవరత్న పథకాలు అమలు చేయాలని

‘ప్రభుత్వ భూములు  విక్రయించడం సరికాదు’

 విజయనగరం దాసన్నపేట, మే 17: రాష్ట్ర ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను అమ్మి నవరత్న పథకాలు అమలు చేయాలని తీర్మానించడం సరి కాదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి వెంకట రమణ తెలిపారు. ఆదివారం కంటోన్మెంట్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో  ఆయన మాట్లాడుతూ...  విశాఖ, గుంటూరు జిల్లాల్లో విలువైన సుమారు 18 ఎకరాలను ఈ-వేలం వేసి నవరత్న పథకాల అమలు చేయాలన్న నిర్ణయాన్ని మానుకోవాలన్నారు.  14వ  ఆర్థిక సంఘం నిధులు,  విపత్తు నిధులు,   ఉద్యోగులు, దాతలు ఇచ్చే నిధులు వందల కోట్లు దాటినా రాష్ట్రంలో పథకాలు సక్రమంగా ఎందుకు అమలు చేయలేక పోతున్నారో అర్థం కావడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  శివప్రసాద్‌,  సోములు, శివ,  సత్యనారాయణ  పాల్గొన్నారు. ఫ కొత్తవలస/ వేపాడ: ఆచరణ సాధ్యంకాని, వ్యయానికి మంచి ఇచ్చిన హామీలను నెరవేర్చేం దుకు విలువైనభూములను ఈ-వేలం ద్వారా విక్రయాలు చేయడం సరికాదని  ఎస్‌.కోట నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు, కార్యదర్శి యల్లపు నగేష్‌ అన్నారు.  కొత్తవలస, మండలం కుమ్మపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికైనా పునారాలోచనచేయాలన్నారు.

Updated Date - 2020-05-18T10:57:23+05:30 IST