మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-31T05:27:30+05:30 IST

అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అబ్దుల్‌ కలీమ్‌ తెలిపారు.

మద్యం సీసాలు స్వాధీనం

పార్వతీపురంటౌన్‌: అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అబ్దుల్‌ కలీమ్‌ తెలిపారు.  మండలంలోని సంగంవలస సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రం నుంచి మన రాష్ర్టానికి 21 మద్యం ఫుల్‌ బాటిళ్లు రవాణా చేస్తున్న విశాఖ జిల్లా గాజువాకకు చెందిన కె. వెంకటనరసింహరావుతోపాటు ములగ గ్రామానికి చెందిన ఎం. వెంకటిలను  బుధవారం జరిపిన దాడుల్లో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
కురుపాం: అక్రమంగా రవాణా చేస్తున్న సారా స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్టు ఎక్స్‌జ్‌ సీఐ జి.సతీష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం మూలిగూడ జంక్షన్‌ వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో, కురుపాం ఎక్స్‌జ్‌ పోలీసులు చేసిన దాడులో చినమేరంగి గ్రామానికి ఐదు రబ్బరు ట్యూబుల్లో రవాణా చేస్తున్న 200 లీటర్లు సారా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోనికి తీసుకోని విచారించి  మిగిలిన వారిపై  కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ దస్తగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:27:30+05:30 IST