సచివాలయ పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-06-18T11:27:24+05:30 IST
సాలూరు మండలంలో 22 గ్రామ సచివాలయాలకు 11 నిర్మాణ పనులు ప్రారంభ మైనట్టు పంచాయతీరాజ్ ఏఈ లోకనాథం చెప్పారు. మామిడిపల్లిలో
సాలూరు రూరల్: సాలూరు మండలంలో 22 గ్రామ సచివాలయాలకు 11 నిర్మాణ పనులు ప్రారంభ మైనట్టు పంచాయతీరాజ్ ఏఈ లోకనాథం చెప్పారు. మామిడిపల్లిలో మాట్లాడుతూ.. మండలంలో 22 గ్రామ సచివాలయాలు, 20 రైతు భరోసా కేంద్రాలు, 11 వెల్‌నెస్ కేంద్రాలకు రూ. 13.76 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. 11 గ్రామ సచి వాలయ పనులు, 18 రైతు భరోసా కేంద్రాలు, 11 వెల్‌నెస్ కేంద్రాల పనులు ప్రారంభం కావాల్సి ఉంద న్నారు.
కొదమ పంచాయతీ సచివాలయం మోనంగి, సం పంగిపాడు సచివాలయం ఎగువరూఢిలో నిర్మాణాలకు కలెక్టర్ అనుమతి కోరనున్నామన్నారు. ఫ మామిడిపల్లిలో సచి వాలయ పనులకు వైసీపీ మండల అధ్యక్షుడు రమణ, పంచాయతీరాజ్ ఏఈ లోకనాథం తదితరులు శంకుస్థాపన చేశారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు మాధవరావు, రమణ, పద్మావతి, తవుడు, శ్రీనివాస రావు, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మురళి, వలంటీర్లు సువ్వాడ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.