సారా స్వాధీనం

ABN , First Publish Date - 2020-04-15T10:55:31+05:30 IST

పట్టణంలో సారా రవాణా చేస్తూ ఇద్దరు పట్టుబడ్డారు. పట్టణంలోని పాత రెల్లివీధికి చెందిన ఎం.సుందరరావు, ఎస్‌.లక్ష్మిలు 80 లీటర్ల సారా, 100 సారా ప్యాకెట్లను...

సారా స్వాధీనం

పార్వతీపురంటౌన్‌, ఏప్రిల్‌ 14: పట్టణంలో సారా రవాణా చేస్తూ ఇద్దరు పట్టుబడ్డారు. పట్టణంలోని పాత రెల్లివీధికి చెందిన ఎం.సుందరరావు, ఎస్‌.లక్ష్మిలు 80 లీటర్ల సారా, 100 సారా ప్యాకెట్లను రవాణా చేస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశామని టాస్క్‌ఫోర్స్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జై.భీమ్‌ తెలిపారు. 


పాచిపెంట: అక్రమంగా తరలిస్తున్న 35 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు తెలిపారు. సాలూరుకు చెందిన కాయ శేషగిరిరావు, ఆర్లి ఈశ్వరరావులపై కేసు నమోదు చేశామన్నారు. ఒడిశా ప్రాంతం సుంకి నుంచి ఆంధ్రాకు దిగుమతి చేస్తుండగా మండలంలోని పి.కోన వలస చెక్‌పోస్టు సమీపంలో ఉన్న దుర్గ గుడి వద్ద పట్టుబడినట్టు ఎస్‌ఐ తెలిపారు. 


మక్కువ: కవిరిపల్లి గ్రామ సమీపంలో 130 సారా ప్యాకెట్లను  తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.రాజేష్‌ తెలిపారు. సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.


Updated Date - 2020-04-15T10:55:31+05:30 IST