పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2020-12-12T05:06:46+05:30 IST

మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించారు. తొలుత మస్తరు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

పారిశుధ్య కార్మికుల ధర్నా
వినతిపత్రం అందిస్తున్న కార్మికులు

బొబ్బిలి, డిసెంబరు 11:  మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించారు. తొలుత మస్తరు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయం ముందు బైఠాయించా రు. ఫేస్‌ రీడింగ్‌ పద్ధతిని పూర్తిగా తొలగించాలన్నారు. ప్రతి ఇంటికీ రీడింగ్‌ తీస్తున్నప్పటికీ అవి పూర్తిగా యంత్రంలో నమోదు కావడం లేదని ధర్నా చేశారు.   సంఘం నాయకుడు పి.శంకరరావు మాట్లాడుతూ రీడింగ్‌ యంత్రాలకు మరమ్మతు చేయడం లేదన్నారు. తడి, పొడి చెత్తలు తప్ప గుట్కా, ప్లాస్టిక్‌, గాజు వ్యర్థాలు, ఆసుపత్రిలో  వ్యర్థాలను సేకరిస్తే కార్మికుల విధులను నిలుపుదల చేస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు.  సచివాలయాలకు పారిశుధ్య కార్మికులను అప్పగించవద్దని డిమాండ్‌ చేశారు.    నాలుగునెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు ఇవ్వాలని, విశ్రాంతి గది కోసం స్థలాన్ని కేటాయించాలని  కోరారు. పై సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని తెలుపుతూ   మేనేజరు పాండ్యానికి మెమోరాండం అందజేశారు. ఈ నిరసనలో కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు యుగంధర్‌, వెంకటరమణ, గౌరీశ్‌, శంకరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2020-12-12T05:06:46+05:30 IST