ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2020-05-13T11:14:10+05:30 IST

స్థానిక చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక ను తరలిస్తున్న ట్రాక్టరును పట్టుకుని కేసు నమెదు చేసినట్టు

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

గజపతినగరం, మే 12: స్థానిక చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక ను తరలిస్తున్న ట్రాక్టరును పట్టుకుని కేసు నమెదు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు మంగళవారం తెలిపారు. పాతశ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన గిరిజాల శంకరరావు చంపావతి నది నుంచి ఇసుకను తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు, సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నామని చెప్పారు.  కేసు నమెదు చేసి ట్రాక్టరును పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.


 శృంగవరపుకోట రూరల్‌: కొట్టాం గ్రామంలోని గోస్తనీ నదీ పరివాహకం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకు న్నట్టు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు. మంగళవారం వేకువజాము నాలుగు గంటల సమయంలో ఇసుక తరలింపుపై అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడి చేశామని చెప్పారు. ఇందులో జామి మండలం విజినిగిరి, గంట్యాడ మం డలం బోనంగి గ్రామాలకు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్‌కు తరలించి, కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Read more