‘ఆధార్‌’ అనుసంధానం కోసం అవే అవస్థలు!

ABN , First Publish Date - 2020-12-11T05:13:51+05:30 IST

ఆధార్‌ కార్డులకు బ్యాంకు ఖాతా , మొబైల్‌ నెంబర్లు అనుసంధానం చేసేందుకు గిరిజనులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.

‘ఆధార్‌’ అనుసంధానం కోసం అవే అవస్థలు!
చిన్నారులతో గిరిజనులు

బొబ్బిలి: ఆధార్‌ కార్డులకు బ్యాంకు ఖాతా , మొబైల్‌ నెంబర్లు అనుసంధానం చేసేందుకు గిరిజనులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇందుకోసం సాలూరు మండలం గిరిజన ప్రాంతాల వారు ఒకరోజు ముందు పిల్లాపాపలతో బొబ్బిలికి వస్తున్నారు.  బొబ్బిలి ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం ఎదుట  రాత్రి వేళ చలిలో మగ్గుతున్నారు.  గురువారం రాత్రి కూడా  ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్‌  పట్టణ  అధ్యక్షుడు మువ్వల శ్రీనివాసరావు, రిటైర్డ్‌ టీచర్‌ అన్వర్‌బాషా స్పందించి వారికి భోజనాలు, దుప్పట్లు,  వసతిని సమకూర్చారు.  సీఐ కేశవరావు  వారికి  రాత్రి బసకు ఏర్పాట్లు చేశారు.

  

Updated Date - 2020-12-11T05:13:51+05:30 IST