సాంబశివరాజు కుటుంబానికి ఎమ్మెల్యేల పరామర్శ

ABN , First Publish Date - 2020-08-18T12:55:13+05:30 IST

దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులను..

సాంబశివరాజు కుటుంబానికి ఎమ్మెల్యేల పరామర్శ

నెల్లిమర్ల(విజయనగరం): దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులను విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్‌,  శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలతో పాటు శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ తదితరులు సోమవారం పరామర్శించారు. వారు నేరుగా మొయిదలోని సాంబశివరాజు స్వగృహానికి వచ్చి సాంబశివరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు సురేష్‌బాబు తదితరులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు తదితరులు సురేష్‌బాబును పరామర్శించి ఓదార్చారు.


Updated Date - 2020-08-18T12:55:13+05:30 IST