సలాం కుటుంబానికి న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2020-11-14T04:58:30+05:30 IST
సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
ముస్లిం నాయకులతో టీడీపీ శ్రేణుల నిరసన
సాలూరు, నవంబరు 13: సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలో బోసుబొమ్మ కూడలి వద్ద శుక్రవారం ముస్లిం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబానిది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అన్నారు. సీబీఐతో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ముస్లిం మైనార్టీ నాయకుడు అబ్దుల్ మాట్లాడుతూ మైనార్టీలకు ఇలా జరిగితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవటం బాధాకరమని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, విక్రం రమణ, అబ్దుల్ గఫూర్, అబ్దుల్ సల్మా, పిన్నింటి ప్రసాద్‌బాబు, లక్ష్మోజీ, చంద్ర, రమణ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఫ డెంకాడ: పోలీసుల వేధింపులు భరించలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడినా రాష్ట్ర ప్రభు త్వం స్పందించకపోవడం దారుణమని మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ అన్నారు. అక్కివరం గ్రామం వద్ద గల మసీదులో శుక్రవారం ముస్లిం సోదరులు, టీడీపీ నాయకులు ప్రార్ధనలు చేశారు. ఈసందర్భంగా చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ, నంద్యాలకు చెందిన సలాం కుటుంబ సభ్యులది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.