సైంధవుల్లా తయారయ్యారు.. !
ABN , First Publish Date - 2020-08-16T12:04:46+05:30 IST
గిరిజన గ్రామాల రహ దారి నిర్మాణాలకు అటవీశాఖ అధికార్లు సైంధవుడి పాత్ర పోషిస్తూ అడ్డుపడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆగ్రహం

అటవీ అధికారులపై ఎమ్మెల్యే రాజన్నదొర ధ్వజం
రోడ్ల నిర్మాణాలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం
సాలూరు, ఆగస్టు 15: గిరిజన గ్రామాల రహ దారి నిర్మాణాలకు అటవీశాఖ అధికార్లు సైంధవుడి పాత్ర పోషిస్తూ అడ్డుపడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక త హసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్వా తం త్య్ర దినోత్సవంలో శనివారం పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించి పతాకా విష్కరణ చేశారు. కరోనా వల్ల విద్యార్థులు లేకపోవటంతో ఆయనే స్వయంగా జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 73,74 రాజ్యాంగ సవరణల్లో భాగంగానే వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు ము ఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు.
జగన్మో హన్‌రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.నియోజకవర్గంలో సారా, గుట్కాల వ్యాపారం సాగుతున్నా సంబంధిత అధికార్లు పట్టించుకోక పోవటం దా రుణమన్నారు. ఈరవాణాలో పాత్ర ధారులను అరెస్టు చేస్తూ.. ప్రధాన సూత్రధారులను వదిలేస్తున్నారని ఆ యన ఆరోపించారు. తెరవెనుక ఎవ రు ఉంటున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. నియోజక వర్గానికి అధిక సం ఖ్యలో రోడ్లను మంజూరు చేసినా అటవీశాఖ అధికార్ల తీరుతో వచ్చిన నిధులు వెనక్కి పోతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లు వేస్తున్న ఐటీడీఏ అధికార్లపై సైతం కేసులు పెట్టడం దురదృష్టకర మన్నా రు. సైంధవుడి పాత్ర పోషిస్తూ అటవీశాఖ అధికార్లు అడ్డుపడుతున్నార న్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. గతంలో ఎన్న డూ లేనట్లు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగు తుందన్నారు.
15000 మంది మహిళలకు రూ.29 కోట్లు చేయూత పథకం ద్వారా అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇబ్రహీం జెండా ఊంఛా రహే హమారా అంటూ గీతాలాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఇన్‌చార్జి కమిష నర్ శేఖర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రాధాకృష్ణ, పట్టణ పోలీస్‌ష్టేషన్ లో ఎస్‌ఐ ఫకృద్దీన్ పతాకావిష్కరణ చేశారు.