-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Respond to the Mansas affair
-
మాన్సాస్ వ్యవహారంపై స్పందించండి
ABN , First Publish Date - 2020-12-28T04:51:33+05:30 IST
మాన్సాస్ వ్యవహారంపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని పీవీజీ రాజు కళా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు.

దాస్నపేట : మాన్సాస్ వ్యవహారంపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని పీవీజీ రాజు కళా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ సమీపంలోని సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాన్సాస్ , సింహాచలం దేవస్థానంపై తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మనో భావాలు దెబ్బతీస్తున్నాయన్నారు. అయోధ్య మైదా నానికి తాళం వేయడం, ఎంఆర్ కళాశాల విద్యార్థులు, సింహాచలం సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఈ అంశాలపై సీఎం, దేవదాయ మంత్రి స్పందించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతినిధులు శ్రీను, రాజారావు తదితరులు పాల్గొన్నారు.