ఆస్తి పన్ను తగ్గించాలని వినతి

ABN , First Publish Date - 2020-12-30T05:57:56+05:30 IST

ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు.

ఆస్తి పన్ను తగ్గించాలని వినతి
బొబ్బిలిలో కరపత్రాల పంపిణీ

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 29:   ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం  13, 14 సచివాలయాల వద్ద వినతిపత్రం అందించారు. అనంతరం నగరపాలక సంస్థ మేనేజరుకు కూడా వినతిపత్రం అందించారు. ఆస్తి పన్నును  క్షేత్రస్థాయిలో ఏ విధంగా పెంచుతున్నారో? అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఆ విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే దీనిపై మంత్రి స్పందించాలని డిమాండ్‌ చేశారు. సంఘ ప్రతినిధులు సన్నిబాబు, రామచంద్రరావు తదితరులు ఉన్నారు. 

 కరపత్రాల పంపిణీ

బొబ్బిలి:  మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను పెంపుదలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పౌరసంక్షేమసంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ  చేశారు.  మంగళ వారం పట్టణంలోని పలు కూడళ్లలో  సంఘం ప్రతినిధి పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ ఆస్తి కాపిటల్‌ విలువ ఆధారంగా పన్ను విధించాలనుకోవడం అర్థరహితమని తెలిపారు. తక్షణం ఈ చట్ట సవరణలను రద్దు చేయాలన్నారు. తాగునీరు, డ్రైనేజీ చార్జీలను పెంచేందుకు ఇచ్చిన 196, 197 జీవోలను రద్దు చేయాలని, పౌరసౌకర్యాల నిర్వహణఖర్చులన్నింటినీ యూజర్‌చార్జీల ద్వారా బాదుడు చేయాలనుకోవడం సరికాదని చెప్పారు. చెత్త నిర్వహణ ఖర్చుకు సంబంధించిన చట్టసవరణను కూడా రద్దు చేయాలన్నారు.  

 

 

Updated Date - 2020-12-30T05:57:56+05:30 IST