-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Request to pay compensation
-
పరిహారం చెల్లించాలని వినతి
ABN , First Publish Date - 2020-12-29T05:05:46+05:30 IST
రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్‌పాత్రోకు వినతిపత్రాన్ని అందజేశారు.

బొబ్బిలి రూరల్: రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్‌పాత్రోకు వినతిపత్రాన్ని అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో గత 19 నెలల్లో 756మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది అత్యంత బాధాకరమని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుం బాలకు గత ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రూ.7 లక్షలకు పెంచినప్పటికీ క్షేత్ర స్థాయిలో కేవలం రూ.2 లక్షలు మాత్రమే అందిస్తుందని ఆరోపించారు. బీమా ప్రీమియం సకాలంలో చెల్లించడంలేదని, పంట పరిహారం ఆలస్యంగా అందుతోందని తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ అల్లాడ భాస్కరరావు, టీడీపీ నాయకులు ఉన్నారు.