వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి

ABN , First Publish Date - 2020-12-06T05:06:50+05:30 IST

వ్యవసాయచట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా కొత్తవలసలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసనకార్యక్రమం చేపట్టారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి
కొత్తవలసలో ఆందోళన చేస్తున్న రైతులు

కొత్తవలస, డిసెంబరు 5: వ్యవసాయచట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా కొత్తవలసలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసనకార్యక్రమం చేపట్టారు. సంఘం అధ్యక్షుడు గాడి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు కొత్తవలస జంక్షన్‌లో ఆందోళన చేశారు. ఈ చట్టం రద్దుకోసం రైతులు చేస్తున్న పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.  

 బొబ్బిలి రూరల్‌:  నూతన వ్యవసాయ  చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి తక్షణమే అన్నదాతల సమస్యలు పరిష్క రించాలని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వి.లక్ష్ముంనాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం  రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ ప్రసాద్‌పాత్రోకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఢిల్లీలో లక్షలాది మంది రైతులు 10 రోజులుగా నిరసన చేపడుతున్నా కేంద్ర సర్కార్‌ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు హాని కలిగించే చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. 

రైతు పోరాట సంఘీభావ నిధి సేకరణ

సాలూరు రూరల్‌: ఢిల్లీలో రైతుల పోరాటానికి సంఘీభావ నిధిని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్‌వై నాయుడు ఆధ్వర్యంలో శనివారం సేకరించారు. మునిసిపల్‌ కార్యాలయంలో కార్మికుల ఫెడరేషన్‌తో కలిసి ఈ నిధిని సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రైతులు చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బంగారి, గంగరాజు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2020-12-06T05:06:50+05:30 IST