-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Rejection of seven nominations
-
ఏడు జడ్పీ నామినేషన్ల తిరస్కరణ
ABN , First Publish Date - 2020-03-13T11:12:08+05:30 IST
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో గురువారం జరిగిన నామినేషన్ల

234 సరిగా ఉన్నట్లు నిర్థారణ
70 ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కృతి
విజయనగరం (ఆంధ్రజ్యోతి) మార్చి 12: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో గురువారం జరిగిన నామినేషన్ల పరిశీలన ఘట్టం తర్వాత ఏడు జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి. 234 సరిగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. అలాగే 549 మండల పాదే శికాలకు 2733 నామినేషన్లు వచ్చాయి. వీటి పరిశీలనలో భాగంగా గురువా రం 70 ఎంపీటీసీ నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ భర్తీలో లోపాలు.. ముగ్గురు పిల్లలు ఉండటం.. వయసు సరిపోకపోవడం తదితర కారణాలతో ఆయా నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణలో తర్వాత మరికొన్ని తగ్గే అవకాశం ఉంది. బరిలో ఎంతమంది ఉంటున్నదీ శనివారం మధ్యాహ్నానికి తేలనుంది.