వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రాస్తారోకో
ABN , First Publish Date - 2020-12-02T05:29:36+05:30 IST
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మండల కేంద్రం బలిజిపేటలో మంగళవారం రైతు సంఘం, ప్రజా సం ఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాకపోకలను అడ్డుకున్నారు.

బలిజిపేట, డిసెంబరు 1: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మండల కేంద్రం బలిజిపేటలో మంగళవారం రైతు సంఘం, ప్రజా సం ఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు కారణంగా రైతులకు తీవ్ర నష్టం కలుగు తోందని, దీనివల్ల పెట్టుబడిదారులకు తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు గేదెల సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వంజరాపు సత్యం నాయుడు, సీఐటీయు నాయకులు వై.మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.