బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-12-29T05:20:11+05:30 IST

బాడంగి మండలంలో ఈ నెల 25న జరిగిన బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు కండి అశోక్‌ అలియాస్‌ రాజును సోమవారం డొంకినవలస రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బాలికపై అత్యాచారం

  నిందితుని అరెస్టు.. పోక్సో కేసు నమోదు

బొబ్బిలి, డిసెంబరు 28: బాడంగి మండలంలో ఈ నెల 25న జరిగిన బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు కండి అశోక్‌ అలియాస్‌ రాజును సోమవారం డొంకినవలస రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి.శోభన్‌బాబు ఆ వివరాలు తెలిపారు. తొలుత బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితురాలికి మహిళా వైద్యురాలితో వైద్య పరీక్షలు  చేయించారు. అనంతరం అత్యాచారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. నూడిల్స్‌ దుకాణంలో పనిచేస్తున్న  నిందితుడు అశోక్‌పై ఐపీసీ 341,  363, 376 ఎ, బీ సెక్షన్ల (పోక్సో) కింద కేసు నమోదు చేసి మహిళా మేజిస్ర్టేట్‌ ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించినట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో బాడంగి ఎస్‌ఐ సురేంద్రనాయుడు, హెచ్‌సీలు పాల్గొన్నారు.

 


Updated Date - 2020-12-29T05:20:11+05:30 IST