మృగాళ్లు!

ABN , First Publish Date - 2020-11-28T03:45:36+05:30 IST

జిల్లాలో చిన్నారులు, బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు వెలుగుచూస్తున్నాయి. చెడు వ్యసనాలకు బానిసైన యువకులు, విద్యార్థులు కర్కశానికి దిగడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు వృద్ధులు సైతం చిన్నారులపై లైంగిక దాడికి దిగుతుండడం అమానుషం.

మృగాళ్లు!


చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు

11 నెలల వ్యవధిలో 23 కేసులు

వెలుగులోకి రానివెన్నో..

కలవరపరుస్తున్న నేరాలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో చిన్నారులు, బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు వెలుగుచూస్తున్నాయి. చెడు వ్యసనాలకు బానిసైన యువకులు, విద్యార్థులు కర్కశానికి దిగడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు వృద్ధులు సైతం చిన్నారులపై లైంగిక దాడికి దిగుతుండడం అమానుషం. జిల్లాలో ఏదో చోట ఇటువంటి కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల స్థానిక పెద్దల సర్దుబాటు,   బయటకు పొక్కితే సామాజికంగా ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో ఘటనలు వెలుగుచూడడం లేదు. ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి కఠిన చట్టాలు అమలుచేస్తున్నా ఘోరాలను నియంత్రించలేకపోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 23 అత్యాచార కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషనకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌, మహిళల అక్రమ రవాణాపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై మరింత కఠినంగా వ్యవహరించాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు. 


   ప్రేమ పేరిట మోసాలు

ప్రేమ పేరుతో మోసాలు అధికంగా జరుగుతున్నాయి. శారీరక అవసరాలు తీర్చుకోవడం, వివాహం ప్రస్తావన తెస్తే ముఖం చాటెయ్యడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల నిలదీస్తున్న బాధితులను చంపడానికి సైతం సిద్ధపడుతున్నారు. ఇటీవల గంట్యాడ మండలంలో వివాహేతర సంబంధం వద్దని చెప్పిన ప్రియురాలినే దారుణంగా హత్యచేశాడు ప్రియుడు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకోవడం, అవి ప్రేమగా మారి వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా యువత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి కదలికలపై కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. వారి అలవాట్లు, స్నేహితులపై దృష్టి పెట్టాలంటున్నారు. 


పెడతోవ పడుతున్న యువత

కరోనాతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆనలైన క్లాసులు తెరపైకి వచ్చాయి. పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఆనలైన గేమ్స్‌కు అలవాటు పడ్డారు. నిషేధిత వెబ్‌సైట్లు సైతం తెరుస్తున్నారు. కొంతమంది యువత ఇక్కడే పెడతోవపడుతున్నారు. వ్యసనాలకు బానిసవుతున్నారు. భవిష్యతను పాడుచేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన ఎంత సౌకర్యమో..అంత అనర్థమని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. Read more