ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించండి
ABN , First Publish Date - 2020-12-14T05:02:26+05:30 IST
ఓటు ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జేసీ కిషోర్‌కుమార్ అన్నారు.

జేసీ కిషోర్‌కుమార్
గజపతినగరం, డిసెంబరు 13: ఓటు ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జేసీ కిషోర్‌కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోగల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు, నైతిక హక్కు లు, ఓటు వినియోగం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 263 కొనుగోలు కేంద్రాల ద్వారా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు చెప్పారు. అనంతరం మెంటాడ రోడ్డులోగల రేషన్ డిపోను పరిశీలించి, సరుకుల ధరలు, సరుకుల సరఫరాపై లబ్ధిదారులను ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.అరుణకుమారి, ఎలక్షన్ డీటీ కె.వెంకటరావు, సీఎస్‌డీటీ రవిశంకర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.