-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Raise awareness on cancer
-
కేన్సర్‌పై అవగాహన పెంపొందించుకోండి
ABN , First Publish Date - 2020-12-20T04:27:31+05:30 IST
: ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రారంభ దశలోనే నివారించుకోవచ్చని విశాఖ లైన్స్ కేన్సర్ ఆసుపత్రి చీఫ్ అంకాలజిస్ట్ వంశీధర్ పుట్రేవు అన్నారు.

శృంగవరపుకోట రూరల్ (జామి) : ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రారంభ దశలోనే నివారించుకోవచ్చని విశాఖ లైన్స్ కేన్సర్ ఆసుపత్రి చీఫ్ అంకాలజిస్ట్ వంశీధర్ పుట్రేవు అన్నారు. శనివారం కుమారాం గ్రామంలో భీశెట్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోగా వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. వారికి తగిన రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించి కేన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో అలమండ పీహెచ్‌సీ వైద్యాధికారిణి పద్మా వతి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. లోక్‌సత్తా రాష ్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టీ బాబ్జీ, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.