కరోనా భయం..రైల్వే స్టేషన్లు ఖాళీ

ABN , First Publish Date - 2020-03-19T10:22:19+05:30 IST

కరోనా వైరస్‌ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపు తోంది. ఎప్పుడూ కిటకిటలాడే విజయనగరం రైల్వే స్టేషన్‌ వారం రోజులుగా వెలవెలబోతోంది. బుధవారం ప్లాట్‌ఫారాలన్నీ ఖాళీగా కనిపించాయి.

కరోనా భయం..రైల్వే స్టేషన్లు ఖాళీ

ప్రత్యేక రైళ్లు రద్దు..  

రూ.10 ప్లాట్‌ఫాం టిక్కెట్టు రూ.50కి పెంపు

ఆలయాలు.. పర్యాటక ప్రదేశాల్లో తగ్గిన రద్దీ


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపు తోంది. ఎప్పుడూ  కిటకిటలాడే విజయనగరం రైల్వే స్టేషన్‌ వారం రోజులుగా వెలవెలబోతోంది. బుధవారం ప్లాట్‌ఫారాలన్నీ ఖాళీగా కనిపించాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన  రైళ్లు ఈ స్టేషన్‌ మీదుగా వెళ్తుంటాయి. అనేకమంది అనేక రాష్ట్రాల ప్రయాణిలతో సందడిగా ఉంటుంది.  దీంతో వైరస్‌ వ్యాప్తించే అవకాశాలు ఉంటాయి.  దీనిని దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణా లను ప్రజలు తగ్గించుకుంటున్నారు. దీంతో రద్దీగా కనిపించే రైళ్లు బుధవారం ఖాళీగా వెళ్తుండటం కనిపించింది.


వేలాది మంది నిత్యం ఫ్లాట్‌ఫా రాలపైనుంచి ప్రవా హంలా దిగే వా రు. కానీ, ప్రస్తుతం ఆపరిస్థితి  మారింది. ఈ రైల్వే స్టేషన్‌లో ఏది కొను గోలు చేయాలన్నా ప్రయాణికులు భయపడుతున్నా రు. దీంతో స్టేషన్‌లో  పాన్‌షాపులను యజమానులు మూసివేశారు. అలాగే, రైల్వే కళాసీలకు పనులు లేకుండా పోయాయి.   రోజు బిజీగా కన్పించే వారు ప్రస్తుతం ఖాళీగా కూర్చుంటున్నారు. ప్రయాణీకులు రద్దీతోపాటు సరుకుల రవాణా కూడా తగ్గిపోవడంతో పనులు లేకుండా పోయినట్లు రైల్వే కళాసీ అప్పలనాయుడు వాపోయాడు.


ప్రయాణికుల రద్దీపై నియంత్రణ

వాస్తవంగా చెప్పాలంటే రైల్వే శాఖ కూడా ప్రయాణికు ల రద్దీని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ముఖ్యం గా ప్లాట్‌ఫారాలపై గుంపులు గుంపులుగా లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు పాటిస్తు న్నది. ఇందుకు గాను ప్లాట్‌ ఫాం టిక్కెట్టును ఒకేసారి నాలుగింతలు పెంచేసింది.  సమీప గ్రా మాలకు పాసిం జర్‌లో చేరాలం టే  మినిమం రూ.10 చార్జీ. కాని ప్లాట్‌ఫారం టిక్కెట్టును మా త్రం రూ.10 నుంచి ఒకేసారి రూ.50కి పెంచింది. దీంతో రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఇ లా ఒకవైపు ప్రయాణీకులు గణనీయంగా తగ్గటం. మరో   స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.


రద్దయిన ట్రైన్లు

కరోనా భయంతో రైళ్లను  రద్దు చేశారు.  08407 భు వనేశ్వర్‌నుంచి సికింద్రాబాద్‌. 08408 సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ ప్రత్యే రైళ్లు రద్దయ్యాయి. 82840, 52841 సంత్రాగచ్చి నుంచి చెన్నై, చెన్నై నుంచి సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. టిట్లాఘర్‌ నుంచి రాయపూర్‌ మార్గంలో మరమ్మతుల కారణంగా రద్దు చేసినవి ఉన్నాయి. 12807, 12808 విశాఖ నుంచి నిజముద్దీన్‌ సమతా, నిజముద్దీన్‌ నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేశారు. బిలాస్‌పూర్‌ నుంచి తిరుపతి(17481), విశాఖ- దుర్గు రైలును రద్దుచేశారు. 

Updated Date - 2020-03-19T10:22:19+05:30 IST