రైతుల వద్దేనే ధాన్యం కొనుగోలు
ABN , First Publish Date - 2020-04-25T10:59:55+05:30 IST
రైతులు పండించే ధాన్యం నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయనున్నట్లు కురుపాం తహసీల్దార్ ఎల్లారావు తెలిపారు.

కురుపాం, ఏప్రిల్ 24: రైతులు పండించే ధాన్యం నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయనున్నట్లు కురుపాం తహసీల్దార్ ఎల్లారావు తెలిపారు. శుక్రవారం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం మీద వీఏఏ, వీహెచ్‌ఏ లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహ సీల్దార్ మాట్లాడుతూ ధాన్యం పండిచే రైతులు గ్రామ సచివాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. నేరుగా రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు.