ప్రజా సంక్షేమమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-23T10:13:50+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

నెల్లిమర్ల, జూన్‌ 22: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం ఆయన ఉత్తర్వులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ చనమల్లు వెంకటరమణ, పార్టీ నాయకులు పతివాడ సత్యనారాయణ, సముద్రపు రామారావు, తుమ్ము వెంకటరమణ, ఎంపీడీవో కె.రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ జి.రాము, నగర పంచాయతీ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు, ఈవోపీఆర్డీ భానోజీరావు పాల్గొన్నారు. ఫ డెంకాడ: మండలంలో నూతనంగా మంజూరైన 244 పింఛన్లను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ కంది సూర్యనారా యణ, వైసీపీ మండల అధ్యక్షుడు బంటుపల్లి వాసుదేవరావు, ఎంపీడీవో డీడీ స్వరూపారాణి, తహసీల్దార్‌ చంద్రమౌళి పాల్గొన్నారు.

Read more