మౌలిక వసతులు కల్పించండి

ABN , First Publish Date - 2020-12-02T05:26:30+05:30 IST

విజయనగరంలోని గాజులరేగ, లంకాపట్నం తదితర ప్రాంతాల్లో జీ+2 విధానంలో నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కోరారు.

మౌలిక వసతులు కల్పించండి
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత

కలెక్టర్‌ను కోరిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత
విజయనగరం రూరల్‌ :
విజయనగరంలోని గాజులరేగ, లంకాపట్నం తదితర ప్రాంతాల్లో జీ+2 విధానంలో నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ను కలసి వినతి పత్రాన్ని అందించారు. విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ వెంటనే గృహనిర్మాణశాఖ పీడీతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ సైలాడ త్రినాథ్‌, టీడీపీ నాయకులు దాట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T05:26:30+05:30 IST