-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Provide educational blessing to PG students
-
పీజీ విద్యార్థులకు ‘విద్యా దీవెన’ అందించాలి
ABN , First Publish Date - 2020-12-29T05:17:01+05:30 IST
ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ఎందుకు రద్దు చేశారని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పార్వతీపురం: ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ఎందుకు రద్దు చేశారని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అనేకమంది ప్రైవేటు కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని, వీరందరికీ జగనన్న విద్యా దీవెన అమలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు విద్యార్థుల మద్దతు కోసం అనేక కార్యక్రమాలు ప్రకటించి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత విద్యార్థులకు మొండి చేయి చూపడం అన్యాయమన్నారు. పాత విధానాన్ని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.