పెట్రో ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2020-06-25T11:42:19+05:30 IST

ప్రజల పరి స్థితిని గుర్తించకుండా ఇష్టానుషారంగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షు డు సరగడ

పెట్రో ధరలు తగ్గించాలి

డీసీసీ అధ్యక్షుడు సరగడ

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన


భోగాపురం, జూన్‌ 24 : ప్రజల పరి స్థితిని గుర్తించకుండా ఇష్టానుషారంగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షు డు సరగడ రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. భోగాపురం సమీపంలోని జాతీయ రహదారిపై చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు శైలజానాద్‌ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, కు టుంబ పోషణకే ఇబ్బంది పడుతున్నార న్నారు.


ప్రజా సమస్యలను కనీసం పట్టించు కోకుండా రోజురోజుకు పెట్రో, డీజిల్‌ ధరలు పెంచుకొంటూ పోతుండడం దారణమన్నా రు. ప్రభుత్వ విధానాల వల్ల దేశం అన్ని రంగాల్లోనూ వెనుకంజులో ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను, ప్రజా సమస్యలను గుర్తించి పెంచిన పెటోరఒల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలన్నారు. పెంచిన ధరలు కారణంగా అన్ని విధాల భారం పడుతుం దని కరోనా, లాక్‌డౌన్‌ నుంచి తేరుకోకుండానే ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్ల కార్డులతో నిరసన తెలిపారు. వాకాడ లక్ష్మణరావు, గుజ్జి రాము, కొయ్య అప్పారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T11:42:19+05:30 IST